Sunday, August 01, 2010 4:19:16 AM

Welcome

Listen on AM 1050
Every Saturday 12:00 - 3:00 PM
Studio Number : 713-461-8313

అందం నా హక్కు   శీతాకాలంలో చర్మ సంరక్షణ...

by SriSatya

 

ఇంతకు ముందు విభాగంలో "అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ " లో "రోజ్ కోల్డ్ క్రీం" తయారి విధానం తెలుసుకున్నాం.ఇప్పుడు "రోజ్ హ్యాండ్ లోషన్ మరియు రోజ్ రూట్ వాటర్" తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.

 

రోజ్ హ్యాండ్ లోషన్:

కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం:
  • పన్నీరు -3 టేబుల్ స్పూన్స్,
  • గ్లిజరిన్-3 టేబుల్ స్పూన్స్,
  • ఆల్కహాల్-3 టేబుల్ స్పూన్స్,
  • నిమ్మ రసం-1 టేబుల్ స్పూన్,
  • కమలా పండు రసం-1 టేబుల్ స్పూన్,
  • వెనీగర్- 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ ఒక బోటల్లో వేసి బాగా కలియబెట్టాలి. అంతే "రోజ్ హ్యాండ్ లోషన్" రెడీ దీనిని ఏ సీజన్ లోనైనా వాడవచ్చు.

"రోజ్ రూట్ వాటర్":
తయారి విధానం:
 
గులాభి మొక్క వేరును చిదిమి ఒక పాత్రలో వేసి తగినన్ని నీటిని వేసిమూత పెట్టి చిన్న మంట మీద ఒక గంట సేపు మరిగించాలి. చల్లారిన తరువాత ఆ నీటిని ఒక బాటిల్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది జిడ్డు చర్మానికి బాగా పని చేస్తుంది. ఈవాటర్ ని ఒక కప్పు లోనికి తీసుకుని దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది.

 


Site designed by: iGurus Solutions