Sunday, August 01, 2010 4:29:01 AM

Welcome

Listen on AM 1050
Every Saturday 12:00 - 3:00 PM
Studio Number : 713-461-8313

అందం నా హక్కు   శీతాకాలంలో చర్మ సంరక్షణ...

by SriSatya

 

ఈ ఈ శీతాకాలంలో కోల్డ్ క్రీంస్, మాయిశ్చురైజర్స్ ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని ఉపయోగించనివారు (అంటే అవి పడకో లేక వాటివలన ఇతర చర్మ వ్యాధులు వస్తాయనే అపోహ ఉన్నవారు) ఉంటారు. ఇలాంటి వారి కోసం ఈ "రోజ్ కోల్డ్ క్రీం" ప్రయత్నించి చూడండి.

రోజ్ కోల్డ్ క్రీం:

కావలసిన పదార్దాలు:
 

  • ఆలివ్ ఆయిల్-4 టేబుల్ స్పూన్స్,
  • గులాభి రెక్కలు - తాజాగా ఉండేవి,
  • బిస్ వ్యాక్స్ -1 టేబుల్ స్పూన్ (అన్ని ప్రముఖ దుకాణాలలో దొరుకుతుంది),
  • స్వచ్చమైన నీరు- తగినంత.
     

తయారు చేసే విదానం :

ఆలివ్ ఆయిల్ ని బాగా మరిగించి దానిని ఒక గాజు సీసా/పాత్రలో వేసుకోవాలి. అందులో గులాభి రెక్కలను వేసి గాలిబయటకు పోకుండా మూత బిగించాలి. దానిని ఒక వారం రోజులు అలానే ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడపోసి గులాభి రెక్కలను వేరు చేయాలి. ఇప్పుడు గులాభి సుగంధం వెదజల్లే ఆలివ్ ఆయిల్ మిగులుతుంది. ఇప్పుడు మరొకపాత్రలో బీన్ వ్యాక్స్ తీసుకుని బాగా కరిగే వరకు వేడి చేయాలి. కరిగినాక సుగంధంకల ఆలివ్ ఆయిల్ ని కలిపి పాత్రను కిందకు దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత కొద్దిగా నీటిని కలిపితే "రోజ్ కోల్డ్ క్రీం" రెడీ. దీనిని ఒక బాటల్ లో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.

 


Site designed by: iGurus Solutions